Namaste NRI

త్వరలో పుతిన్ భారత్ పర్యటన

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ఏడాది చివరిలో  భారతదేశంలో పర్యటిస్తారు. ప్రస్తుతం తేదీలు ఖరా రు అవుతున్నాయని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ధృవీకరించారు. ప్రస్తుతం దోవల్ మా స్కో పర్యటనలో ఉన్నారు. రష్యా భద్రతా మండలి కార్యద ర్శి సెర్గీ పోయింగుతో చర్చల అనంతరం దోవల్ మాట్లాడుతూ పుతిన్ భారత సందర్శన పట్ల ఆనందంగా ఉందన్నారు. భారత రష్యా శిఖరాగ్రసమావేశం ద్వైపాక్షిక సం బంధాలను మరింత దృఢతరం చేస్తుందన్నారు. 2020లో రష్యా -ఉక్రేయిన్ వివాదం ప్రారంభమైన తర్వాత పుతిన్ భారతదేశంలో పర్యటించడం ఇదే ప్రథమం కాగలదు. ప్రధాని మోదీ గత సంవత్సరం రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను రెండు సార్లు కలిశారు. నిరుడు జూలై 22న భారత రష్యా శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ మాస్కోకు తొలిసారి వెళ్లారు. మూడో పదవీకాలం ప్రారంభసమయంలో మరో సారి వెళ్లారు. భారతదేశం రష్యానుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు ట్రంప్ ఆగ్రహం, భారత- అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్ననేపథ్యంలో పుతిన్ పర్యటన కీలక పరిణామం కానున్నది.

Social Share Spread Message

Latest News