మాస్ మహారాజు రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ఖిలాడి షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ చిత్రాన్ని సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డిరపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రయూనిట్ దుబాయ్‌లో ఉంది. రవితేజ, మీనాక్షి చౌదరి, డిరపుల్ హయతిలపై అందమైన పాటను చిత్రీకరిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ట్యూన్‌కు యశ్వంత్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ పాట చిత్రీకరణ ప్రారంభమైంది. దుబాయ్‌తో పాటు మస్కట్‌లోని కొన్ని ప్రదేశాల్లో ఈ పాటను చిత్రీకరించనున్నారు. పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయంతో అలరించనున్నారు. కూర్పు: అమర్ రెడ్డి, ఛాయాగ్రహణం: సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణు.














