Skip to main content

Namaste NRI

వలస కార్మికులకు శుభవార్త.. కొత్త వీసాలకు కువైట్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

వలస కార్మికులకు కువైట్‌ ప్రభుత్వం శుభవార్త అందించింది. కొత్త వచ్చే వలస కార్మికులకు వీసాలు జారీ చేయాలని నిర్ణయించింది. కరోనా వైరస్‌ కారణంగా 2020 మార్చి నుంచి కువైట్‌, కార్మికులకు కొత్త వీసాల జారీని నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కువైట్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ కేసులు తగ్గిపోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. వ్యాపార, వాణిజ్య రంగాలలో కార్యకలాపాలు ఊపందుకోవడంతో కువైట్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కరోనా సమయంలో విదేశీ వలస కార్మికులు పెద్ద ఎత్తున స్వస్థలాలకు తరలిపోవడంతో ప్రస్తుతం కువైట్‌లో కార్మికుల కొరత ఏర్పడిరది. గతంలో వీసా గడువు ఉన్నా కరోనా కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో కార్మికులను ఇంటికి పంపించిన కంపెనీలు పాత కార్మికులను మళ్లీ రావాల్సిందిగా కోరుతున్నాయి.

                కొత్త వీసాల జారీకి కువైట్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అవసరం ఉన్న రంగాల్లో వలస కార్మికులను రప్పించుకోవడానికి ఆయా కంపెనీలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. కువైట్‌ ప్రభుత్వ నిర్ణయంపై తెలుగు రాష్ట్రాలలోని వలస కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News