Namaste NRI

హెచ్‌-1బీ వీసా ప్రక్రియలో కీలక మార్పులు… ఇకపై వీటి ఆధారంగానే ఎంపిక

లాటరీ పద్థతికి తిలోదకాలు ఇచ్చి నైపుణ్యతతో కూడిన ఉద్యోగాలు చేస్తున్న వారికి మాత్రమే హెచ్‌-1బీ వీసాలు పంపిణీ చేయాలన్న కొత్త నిబంధనను వైట్‌ హౌస్‌కు చెందిన ఆఫీస్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ రెగ్యులేటరీ అఫేర్స్‌ ఆమోదించినట్లు  తెలిపింది. హెచ్‌1-బీ వీసాల మంజూరు ప్రక్రియను ప్రక్షాళన చేయాలని సంకల్పించిన ట్రంప్‌ ప్రభుత్వ చర్యలలో భాగంగా కొత్త నిబంధన అమలులోకి రానున్నది. ఇప్పటివరకు జరుగుతున్న లాటరీ పద్ధతి ద్వారా కాకుండా హెచ్‌-1బీ దరఖాస్తుదారుల ఆదాయాల ప్రాతిపదికన ప్రాధాన్యం ఇవ్వాలని ట్రంప్‌ ప్రభుత్వం యోచిస్తోంది. అయితే ఈ కొత్త నిబంధన గురించి అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.

ప్రస్తుతం ఐటీ రంగం అత్యధికంగా ఉపయోగించుకుంటున్న హెచ్‌-1బీ ప్రోగ్రామ్‌ కింద గరిష్ఠంగా ఏడాదికి 85,000 వీసాలను మాత్రమే యూఎస్‌ మంజూరు చేసో ్తంది. ఆదాయాలను ప్రాతిపదికగా చేసుకుని హెచ్‌-1బీ వీసాలను కేటాయించాలని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌) 2021లో సిఫా ర్సు చేసింది. ఎక్కువ జీతాలు కలిగిన ఉద్యోగులను నాలుగు విభాగాలుగా వేరు చేయాలని డీహెచ్‌ఎస్‌ సూచించింది. ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని డీహెచ్‌ఎస్‌ ట్రంప్‌ వచ్చాక మరోసారి ప్రతిపాదించింది.

Social Share Spread Message

Latest News