
భారత్, పాకిస్థాన్ తో సంబంధాల్లో ఎలాంటి మార్పు ఉండబోదని, ఆ రెండు దేశాలతోనూ తమకు సత్సంబంధాలు కొనసాగుతున్నాయని అమెరికా పేర్కొంది. పాకిస్థాన్ సైనిక నాయకత్వంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జరుపుతున్న చర్చలవల్ల ప్రధాని నరేంద్ర మోదీతో ఉన్న సంబంధాలపై ఎలాంటి ప్రభావం పడదని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టమ్మీ బ్రూస్ తెలిపారు.
















