Namaste NRI

వెనక్కి తగ్గిన ట్రంప్‌… మరో 90 రోజుల విరామం

భారత్‌పై అధిక టారిఫ్‌లను అమలు చేయడంలో అమెరికా దూకుడుగా వ్యవహారిస్తోన్న వేళ, మన పొరుగుదేశం చైనాతో మాత్రం తలొగ్గుతోనే ఉంది. తాజాగా చైనాతో వాణిజ్య ఒప్పందానికి మరో 90 రోజుల విరామం ప్రకటిస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయం తీసుకున్నారు. రష్యా చమురు కొనుగోలును కారణంగా చూపి భారత్‌పై ట్రంప్‌ ఇటీవల భారీస్థాయిలో 50 శాతం సుంకాలు విధించారు. అదే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న చైనా విషయంలో మాత్రం ట్రంప్‌ భిన్నవైఖరిని అవలంభించడం విశేషం. యూఎస్‌ తాజా నిర్ణయంతో ఇరు దేశాలు విధించుకున్న అధిక సుంకాల అమలు నిలిచిపోయింది. అధిక సుంకాల అమలును నవంబర్‌ 10వ తేదీ అర్థరాత్రి వరకూ నిలిపివేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశానని ట్రంప్‌ ప్రకటించారు. అటు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ కూడా సుంకాల విధింపునకు విరామం ప్రకటించింది. వాణిజ్యం, పెట్టుబడుల పరిమితి జాబితాలోకి అమెరికా సంస్థలను చేర్చడాన్ని కూడా 90 రోజులు వాయిదా వేసింది.

Social Share Spread Message

Latest News