నారా రోహిత్ కథానాయకుడిగా రూపొందిన సినిమా సుందరకాండ. వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వం. సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్‌రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది.ఈ సందర్భంగా ఇందులో కథానాయికల్లో ఒకరైన శ్రీదేవి విజయ్‌కుమార్ హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు. ఇందులో చాలా మీనింగ్ ఫుల్ క్యారెక్టర్ చేశాను. ఇలాంటి పాత్ర కోసమే ఇన్నాళ్లూ వెయిట్ చేశా. కొత్త పాయింట్‌తో వస్తున్న సినిమా ఇది. అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చింది. ఒక ఆడియన్‌గా ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది అని అన్నారు.

ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత నన్నునేను స్క్రీన్‌మీద చూసుకోవడం ఎక్సైటింగ్‌గా ఉంది. ప్రభాస్‌కు జోడీగా నేను నటించిన ఈశ్వర్ సినిమా లాస్ట్ ఇయర్ రీరిలీజ్ అయింది. ఆ నెక్ట్స్ ఇయర్ మళ్లీ నేను హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అంటూ ఆనందం వెలిబుచ్చారు శ్రీదేవి విజయ్‌కుమార్. డైరెక్టర్ ఈ కథ చెప్పగానే షాక్ అయ్యానని, ఇలాంటి పాత్ర చేయడం ఇదే ప్రథమమని, తన పాత్రలో డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయని శ్రీదేవి చెప్పారు.
















