ప్రపంచములో అతి పెద్ద దయిన న్యూ యార్క్ ఇండియా పెరేడ్ వేడుకలో భాగంగా, తెలుగు అస్సోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా ( TANA) పాల్గొంది , ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) సమాజానికి “జీరో ప్లాస్టిక్” సందేశాన్ని కనుబరిచింది సభ్యులు గర్వంగా మరియు ఉత్సాహంగా జెండాలను ఊపుతూ 85 డిగ్రీల వేడిలో రెండు మైళ్లదూరం నడిచారు. వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ, ఎవరూ అలసట సంకేతాలను చూపించలేదు – వారి స్ఫూర్తి మరియు అంకితభావం సమాజం మరియు మాతృభూమి పట్ల వారి ప్రేమను ప్రతిబింబించాయ 50 వసంతాలు చేరు అవుతున్నఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ని చూడగానే జనసందోహం తమ ఆనందాన్ని అభివాదం తోటి చేతులు వూపుతూ కనుబరిచారు.

ఈ ఏడాది పెరేడ్ కి గ్రాండ్ మార్షల్స్ గా పాన్ ఇండియా స్టార్స్ విజయ దేవరకొండ, రష్మిక ఈ వేడుకకు హాజరయ్యారు, మండు టెండలో నవ్వుతు అందరకి అభి వాదము చేశారు. ప్రపంచములో అతి పెద్దయిన న్యూ యార్క్ ఇండియా పెరేడ్ లో సంబరాలు అనంతరము తానా ఫౌండేషన్ ట్రస్టీ శ్రీనివాస్ ఓరుగంటి, సతీష్ మేక ముందు తరానికి ప్రేరేపనించే కార్యక్రమాలు గూర్చి భారతదేశములో, అమెరికా లో చేయాలిసినా అందరకి అవసరమైన చోట ఆసరా విధానమైన కార్యక్రమాలు గూర్చి చర్చించారు.


తానా స్పెషల్ ప్రాజెక్ట్స్ కోఆర్డినేటర్ నాగ పంచుమర్తి ఆడంబరానికి పోకుండా దాత లు ఇచ్చే ప్రతి పైసా ప్రాజెక్టు లకు నిస్వార్ధముగా వినియోగిస్తున్నామని విన్నవించారు తానా ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్, అమెరికన్ స్కూల్ కమిటి సభ్యులు కృష్ణ ప్రసాద్ సోంపల్లి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కి కేవలం పాల్గొనుటయే కాకుండా మన సమాజానికి స్ఫూర్తి నిచ్చే సమర్థవంతమైన ప్రదర్శన దాని ప్రాముఖ్యము గూర్చి విడమర్చి చెప్పారు.


ప్రపంచములో అతి పెద్దయిన న్యూ యార్క్ ఇండియా పెరేడ్ లో పాలుగొన్న ప్రతి ఒక్కరికి న్యూయార్క్ రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ భర్తవరపు, న్యూ జెర్సీ రీజినల్ కోఆర్డినేటర్ సుధీర్ చంద్ నారెపలేపు, న్యూ ఇంగ్లాండ్ రీజినల్ కోఆర్డినేటర్ మౌనిక మణికొండ, వాలంటీర్స్ నిశాంత్ కొల్లి సాయి మిన్నకంటి, వినయ్ కూచిపూడి, రావు యలమంచలి, ప్రసాద్ కోయె, పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు.



















