Namaste NRI

సుందరకాండకు అద్భుతమైన రెస్పాన్స్‌ :నారా రోహిత్‌

నారా రోహిత్‌  కథానాయకుడిగా నటించిన చిత్రం సుందరకాండ.   ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. వెంకటేష్‌ నిమ్మలపూడి దర్శకత్వంలో సందీప్‌ పిక్చర్‌ ప్యాలెస్‌ సంస్థ నిర్మించింది. ఈ సందర్భంగా థాంక్స్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నారా రోహిత్‌  మాట్లాడుతూ ఈ సినిమాకు అంతటా పాజిటివ్‌ రెస్పాన్స్‌ లభిస్తున్నది. టికెట్‌ ధరల్ని కూడా అందరికి అందుబాటులో ఉంచాం. ఈ వీకెండ్‌లో స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్‌ చేసే సినిమా ఇది అన్నారు.  ఈ సినిమాలో కామెడీని ఆడియెన్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తున్నారని, ఫలితంతో టీమ్‌ అందరం హ్యాపీగా ఉన్నామని తెలిపారు.

 ఈ సినిమా చూసి ఇంటిల్లిపాది హాయిగా నవ్వుకుంటున్నారని దర్శకుడు వెంకటేష్‌ నిమ్మలపూడి అన్నారు. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ తీశారని ప్రశంసలొస్తున్నాయని, సెన్సిటివ్‌ పాయింట్‌ను దర్శకుడు అందరూ మెచ్చేలా ప్రజెంట్‌ చేశారని, అమెరికాలో కూడా వసూళ్లు పెరుగుతున్నాయని నిర్మాతలు సంతోష్‌ చిన్నపొల్ల, రాకేష్‌ మహంకాళి ఆనందం వ్యక్తం చేశారు.

Social Share Spread Message

Latest News