Namaste NRI

మైథలాజికల్‌ థ్రిల్లర్‌గా .. మయూఖం

కుశలవ్‌, తన్మయి జంటగా మయూఖం పేరుతో ఓ మైథలాజికల్‌ థ్రిల్లర్‌ తెరకెక్కనున్నది. వెంకట్‌ బులెమోని దర్శకుడు. సినెటేరియా మీడియా వర్క్స్‌ పతాకంపై శ్రీలత వెంకట్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది.మైథలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీ ఇదని, ఆరేళ్లు కష్టపడి ఈ స్క్రిప్ట్‌ రెడీ చేశానని, దీనినొక ఫ్రాంచైజీలా, ఒక యూనివర్స్‌లా క్రియేట్‌ చేయబోతున్నామని, వందశాతం ఇన్‌ ఫిల్మ్‌ బ్రాండింగ్‌తో వస్తున్న తొలి ఇండియన్‌ మూవీ ఇదేనని, వాస్తవ సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని దర్శకుడు తెలిపారు.

ఈ చిత్రంతో నా లైఫ్‌లో మరో ఫేజ్‌లోకి ఎంటర్‌ అవుతున్నా. డైరెక్టర్‌ వెంకట్‌ ఎంత హార్డ్‌ వర్కర్‌ అనేది నాకు తెలుసు. ఈ చిత్రంలో బిజినెస్‌ పరంగానే కాదు టెక్నికల్‌గా కూడా కొత్తగా ప్రయత్నిస్తున్నాం. మీ అందరికీ మా నటన నచ్చుతుంది అని హీరో కుశ్‌ లవ్‌ చెప్పారు. హీరోయిన్‌ తన్మయి మాట్లాడుతూ ఈ సినిమాలో హీరోయిన్‌గా నేను పర్పెక్ట్‌గా సెట్‌ అవుతానని నమ్మి, నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్‌ వెంకట్‌కి థ్యాంక్స్‌. నా గత చిత్రాల్లాగే ఈ సినిమాలో కూడా మంచి క్యారెక్టర్‌ లభించింది అని తెలిపారు.  సత్యరాజ్‌, సత్యప్రకాశ్‌, మకరంద్‌ దేశ్‌పాండే తదితరులు ఇతర పాత్రలు పోషిస్తు న్నారు. ఈచిత్రానికి కెమెరా: సిద్ధం మనోహర్‌, సంగీతం: ఆర్‌ ఆర్‌ ధృవ.

Social Share Spread Message

Latest News