Skip to main content

Namaste NRI

ఐరాస నిబంధనలకు..ప్రపంచ దేశాలు కట్టుబడి ఉండాలి

అగ్రరాజ్యం అమెరికాపై మరోసారి చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌  పరోక్షంగా విమర్శలు చేశారు. చైనాను ఒక దేశంగా ఐక్యరాజ్యసమితి గుర్తించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక సదస్సులో జిన్‌పింగ్‌ మాట్లాడారు. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన అంతర్జాతీయ చట్టానికి ప్రపంచ దేశాలన్నీ ఎలాంటి మినహాయింపులు లేకుండా కట్టుబడి ఉండాలని తేల్చి చెప్పారు. అంతర్జాతీయ నిబంధనలకు ఏవో కొన్ని దేశాలు నిర్దేశించలేవని స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి అధికారాన్ని అందరూ ఆమోదించాలని, సమితి పట్ల నిబద్ధులై  ఉండాలని అన్నారు. అంతర్జాతీయ నిబంధనలను ఐక్యరాజ్యసమితిలోని 193 సభ్య దేశాలు మాత్రమే కలిసికట్టుగా రూపొందిస్తాయని అన్నారు. ఇందులో మరో మాటకు తావు లేదని వ్యాఖ్యానించారు. కొన్ని దేశాలు కూటములు ఈ పని చేయలేవని పరోక్షంగా అమెరికాకు చురక అంటించారు. సమితిని గౌరవించాలని ప్రపంచ దేశాలకు జిన్‌ పింగ్‌ సూచించారు. సమితిని విచ్చన్నం చేసే ప్రయత్నాలకు దూరంగా ఉండాని అన్నారు.

Social Share Spread Message

Latest News