Namaste NRI

ఓజీ మూవీ ఘనవిజయం కోసం.. క్యాన్సర్‌ ఆస్పత్రికి విరాళం

అమెరికాలోని సియాటెల్‌లో పాపులర్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వ ప్రసాద్‌ ఆధ్వర్యంలో 11 రోజులపాటు వినాయకచవితి ఉత్సవాలు గ్రాండ్‌గా ముగిశాయి. పవన్ కల్యాణ్ అభిమానులు లడ్డూను దక్కించుకునేందుకు వారంతా వేలం పాటలో పాల్గొని, రూ.3 లక్షలకు గణపయ్య లడ్డూను సొంతం చేసుకున్నారు. అనంతరం ఆ లడ్డూను భక్తులకు పంచి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పవన్‌ కళ్యాణ్ ఓజీ మూవీ ఘనవిజయం సాధించాలని కోరుకుంటూ లడ్డూ వేలంపాటలో పాల్గొన్నట్టు ఈ సందర్భంగా అశోక్‌ గల్లా తెలిపారు. లడ్డూ వేలంలో వచ్చిన మొత్తాన్ని సియాటెల్‌ క్యాన్సర్‌ ఆస్పత్రికి విరాళంగా అందిస్తామని వినాయక ఉత్సవాలను నిర్వహించిన నాసా సంస్థ ప్రతినిధులు ప్రకటించారు.

లడ్డూ వేలం పాటలో జనార్దన్ చక్కా, అశోక్ పసుపులేటి, లక్ష్మీనారాయణ, నవీన్‌ గంధం, సతీశ్‌ బత్తిన, నాసా సంస్థ ప్రతినిధులు వినోద్‌ పర్ణ, సుహాగ్ గండికోట, నితీశ్‌, నరేంద్రతోపాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News