Namaste NRI

నాగచైతన్య విడుదల చేసిన బ్యూటీ  ట్రైలర్ చూశారా?

తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంతో వస్తున్న చిత్రం బ్యూటీ. అంకిత్‌ కొయ్య, నీలఖి జంటగా నటించిన ఈ చిత్రానికి జె.ఎస్‌.ఎస్‌.వర్ధన్‌ దర్శకుడు. విజయ్‌పాల్‌రెడ్డి అడిదల, ఉమేష్‌కుమార్‌ భన్సల్‌ నిర్మాతలు. అగ్ర హీరో నాగచైతన్య ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేసి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు.

ఎప్పుడైనా నేను నిన్ను కోప్పడితే నన్ను వదిలిపెట్టి వెళ్లకు  అని హీరోయిన్‌ అంటే నిన్ను వదిలేసి వెళ్లడం అంటే.. నా ఊపిరి వదిలేయడమే కన్నా అని హీరో చెప్పడంతో ట్రైలర్‌ మొదలైంది. స్కూటీ కొనిస్తానని తండ్రి మాట ఇవ్వడం, మిడిల్‌ క్లాస్‌ ఫాదర్‌ ఎమోషన్స్‌ ఈ ట్రైలర్‌లో చూడొచ్చు. నరేష్‌, వాసుకి, నంద గోపాల్‌ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ నెల 19న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌, నిర్మాణం: వానర సెల్యులాయిడ్‌, జీ స్టూడియోస్‌, మారుతీ టీమ్‌ ప్రొడక్ట్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events