Namaste NRI

న్యూయార్క్ టైమ్స్‌పై.. డొనాల్డ్ ట్రంప్ దావా

 గత కొన్ని దశాబ్దాలుగా న్యూయార్క్ టైమ్స్ పత్రిక తనపై అసత్య ప్రచారాలని వ్యాప్తి చేస్తోందని ఆరోపిస్తూ ఆ పత్రికపై 15 బిలియన్ డాలర్ల (రూ.1.32 లక్షల కోట్ల) కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ దావా వేశారు. ఈ పత్రికతోపాటు ఆ పత్రిక జర్నలిస్టులు నలుగురిపై ఫ్లోరిడా లోని యుఎస్ డిస్ట్రిక్టు కోర్టులో దావా దాఖలైంది. తనపై అనేక కథనాలు వ్యతిరేకంగా ప్రచురించారని, దాంతోపాటు ఒక పుస్తకాన్ని కూడా ఆ పత్రిక జర్నలిస్టులు ఇద్దరు రచించి 2024 ఎన్నికల వరకు ప్రచురించారని ట్రంప్ ఆరోపించారు. ట్రంప్ పరువుకు నష్టం కలిగేలా దురుద్దేశ్యపూర్వకంగా ఇవన్నీ ప్రచురించారని దావాలో పేర్కొన్నారు. అయితే దీనిపై న్యూయార్క్ టైమ్స్ ఇంతవరకు స్పందించలేదు.

Social Share Spread Message

Latest News