
ఉద్యోగ బాధ్యతల పైన, లేక సెలవుల పైన అమెరికా వెలుపల ఉన్న తమ హెచ్-1బీ ఉద్యోగులు లేదా వారి కుటుంబ సభ్యులు 24 గంటల్లో అమెరికాకు తిరిగి రావాలని, లేనిపక్షంలో వారు వెలుపలే నిలిచిపోయే ప్రమాదం ఉందని ప్రధాన టెక్ కంపెనీలు హెచ్చరించాయి. అమెరికాలో ఉన్నవారు దేశాన్ని వదిలి వెళ్లవద్దని తమ హెచ్-1బీ వీసాదారులైన ఉద్యోగులను ఆదేశించాయి. హెచ్-1బీ వీసాదారుల చట్టపరమైన జీవిత భాగస్వాములు, వారి అవివాహిత పిల్లలకు హెచ్-4 వీసాలు లభిస్తాయి. ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసా ఫీజులు భారీగా పెంచిన నేపథ్యంలో ఆ వీసాలపై ఉన్న తమ ఉద్యోగులు అమెరికాను వదిలి వెళ్లవద్దని మైక్రోసాప్ట్, జేపీ మోర్గన్, అమెజాన్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలు సూచించాయి.
















