Skip to main content

Namaste NRI

ఇడ్లీ కొట్టు సెంటిమెంట్..ధనుష్ కొత్త సినిమా ట్రైలర్ చూశారా?

ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన విభిన్న కథాచిత్రం ఇడ్లీ కడై. నిత్యామీనన్‌ కథానాయిక. డాన్‌ పిక్చర్స్‌, వండర్‌బార్‌ ఫిల్మ్స్‌ పతాకాలపై ఆకాశ్‌ భాస్కరన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీ వేదక్షర మూవీస్‌ ద్వారా రామారావు చింతపల్లి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమా ట్రైలర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు.గ్రైండర్‌ కొంటే పని తేలికవుతుంది, సమయం కూడా ఆదా అవుతుంది. అని తండ్రిని ఒప్పిస్తూ ధనుష్‌ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. ఆద్యంతం ఆసక్తికరంగా ట్రైలర్‌ సాగింది. సంప్రదాయ ఇడ్లీకొట్టు నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని ట్రైలర్‌ చెబుతున్నది. బడా వ్యాపారస్థుల కారణంగా తన ఇడ్లీకొట్టు మనుగడకే ముప్పు వాటిల్లినప్పుడు ఆ సవాళ్లను హీరో ఎలా ఎదుర్కొన్నాడు? తన గౌరవాన్ని నిలబెట్టుకునేందుకు హీరో చేసే పోరాటమేంటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ అని తెలుస్తున్నది.

ట్రైలర్‌లో ధనుష్‌, రాజ్‌కిరణ్‌ తండ్రీకొడుకులుగా కనిపించారు. అరుళ్‌విజయ్‌ ప్రతినాయకుడిగా అలరించారు. నిత్యామీనన్‌ పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ధనుష్‌, నిత్యాల కెమిస్ట్రీ కూడా బావుంది. షాలినీ పాండే, సత్యరాజ్‌ కీలక పాత్రలు పోషించారు.ఈ సినిమా ఇడ్లీ కొట్టు పేరుతో అక్టోబర్‌ 1న తెలుగులో విడుదల కానుంది ఈ చిత్రానికి కెమెరా: కిరణ్‌ కౌశిక్‌, సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events