
నటుడు విక్టరీ వెంకటేశ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజ కార్యక్రామాలు పూర్తి చేసుకున్న చిత్రయూనిట్ అక్టోబర్‌లో రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభించనుంది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. వెంకీ 77 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ రాబోతుంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి తాజాగా ఒక విషయం వైరల్‌గా మారింది. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ తన టీమ్ మొత్తాన్ని మార్చినట్లు తెలుస్తుంది. కొత్తవారిని ఈ సినిమా కోసం తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్‌లో టాక్ నడుస్తుంది. అయితే ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.
















