ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ రొమాంటిక్ కామెడీ హారర్ మూవీ ది రాజాసాబ్. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ కథానాయికలు. మారుతి దర్శకత్వం. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌ని వేగవంతం చేశారు. ఇందులో భాగంగా నేటి సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేయనున్నారు.ఈ విషయాన్ని ఓ ప్రకటన ద్వారా మేకర్స్ తెలియజేశారు. ప్రభాస్ అభిమానులతోపాటు మూవీ లవర్స్ అందరూ అనందించేలా ఈ ట్రైలర్ ఉండబోతున్నదని వారు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో ప్రభాస్, సంజయ్‌దత్ కాంబో స్టిల్ ఆసక్తికరంగా ఉంది.

కామెడీ హారర్ జానర్‌లో ప్రభాస్ నటించడం ఇదే ప్రథమం. దర్శకుడు మారుతి తనదైన శైలిలో జనరంజకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎవర్‌గ్రీన్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది అని మేకర్స్ తెలిపారు. సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ పళని, సంగీతం: తమన్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల.















