Skip to main content

Namaste NRI

బ్యాడ్ బాయ్ కార్తీక్ టీజర్‌ విడుదల

నాగ శౌర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం బ్యాడ్ బాయ్ కార్తీక్. విధి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. టీజర్ నిడివి తక్కువగా ఉన్నా, అందులో చూపించిన విజువల్స్, డైలాగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. బ్యాడ్ బాయ్ అనుకుంటే,స్మార్ట్ బాయ్ లా ఉన్నావ్ అనే డైలాగ్‌తో మొదలైన ఈ టీజర్‌లో నాగశౌర్య ఎనర్జిటిక్ మాస్ అవతారాన్ని ప్రదర్శించాడు. ఇప్పటి వరకు నాగశౌర్య చేసిన‌ సాఫ్ట్ బాయ్ ఇమేజ్‌కు భిన్నంగా, ఈసారి యాక్షన్ మోడ్‌లో కనిపించనున్నాడు.

టీజర్‌లో సాయి కుమార్ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో, పూర్ణ సీరియస్ లుక్‌తో కనిపిస్తూ కథకు బలమైన బేక్‌డ్రాప్ ఉందని సూచిస్తున్నారు. ఈ మూవీ యాక్షన్, ఎమోషన్ మిక్స్‌తో వినోదాత్మకంగా ఉండబోతోందని టీజర్ చెప్పకనే చెబుతోంది.ప్రముఖ సంగీత దర్శకుడు హరీష్ జైరాజ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అలాగే ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు కట్స్ టీజర్ టోన్‌ను మరింత షార్ప్‌గా మలిచాయి. ఈ చిత్రానికి రామ్ దేసిన దర్శకత్వం వహిస్తున్నారు. వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మాణం జరుపుతున్న ఈ చిత్రం, ఆ బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా కావడం విశేషం. యూత్‌ ఫుల్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events