రోషన్ మేకా, ప్రీతి ముకుందన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ఏమో ఏమో ఇది. డా. శైలేష్ కొలను రచన, దర్శకత్వంలో తెరకెక్కుతోంది. నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకురానుంది. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి ఏమో ఏమో ఇది టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు.

ప్రేమలోని ఉత్సాహాన్ని, మనసులోని మధుర భావాలకు అద్దం పడుతూ మెలోడీ ప్రధానంగా ఈ పాట సాగింది. మంచు కొండల అందాలు, చక్కటి విజువల్స్‌తో ఈ పాట హృదయానికి హత్తుకునేలా సాగింది. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందించిన ఈ పాటను కార్తీక్, రమ్య బెహరా ఆలపించారు. కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించారు.















