Skip to main content

Namaste NRI

సత్య, యోగిబాబు కాంబోలో.. గోల్డెన్ భాగ్యం

హాస్య నటులు సత్య, యోగిబాబు కలిసి గోల్డెన్‌ భాగ్యం పేరుతో ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌కు శ్రీకారం చుట్టారు. పవన్‌ బాసంశెట్టి ఈ చిత్రానికి దర్శకుడు. డ్రీమ్‌ మూవీ మేకర్స్‌, నయవాయు పతాకాలపై నాగార్జున రెడ్డి, పవన్‌ బాసంశెట్టి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంగళవారం టైటిల్‌ గ్లింప్స్‌ని విడుదల చేశారు. ఇందులో తెలుగు, తమిళ వ్యక్తులిద్దరూ తమకు ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదిస్తూ తమ వంటకాలే బెస్ట్‌ అని చెప్పుకోవడం నవ్వులు పూయిస్తున్నది.

తెలుగు వ్యక్తి బిర్యానీతో పాటు కూల్‌డ్రింక్‌ని ఆస్వాదిస్తుండగా, తమిళ వ్యక్తి ఇడ్లీ సాంబార్‌ తింటూ కనిపిస్తున్నారు. గ్లింప్స్‌లో వీరిద్దరి సరదా సంభాషణ హైలైట్‌గా నిలిచింది. క్రైమ్‌, యాక్షన్‌ అంశాలు కలబోసిన లవ్‌స్టోరీ ఇదని మేకర్స్‌ తెలిపారు. సత్య, యోగిబాబు, జయశ్రీ అతిరాజ్‌, వెన్నెల కిషోర్‌, సుదర్శన్‌, కిషోర్‌ తిరుమల, రోహిణి, తనికెళ్ల భరణి, సునీల్‌ రెడ్డి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: బబ్లూ అజు, సంగీతం: పవన్‌ సిహెచ్‌, రచన-దర్శకత్వం: పవన్‌ బాసంశెట్టి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events