Namaste NRI

విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రారంభం

విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. రవి కిరణ్‌ కోలా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్‌ కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్‌ క్లాప్‌నివ్వగా, నిరంజన్‌ రెడ్డి కెమెరా స్విఛాన్‌ చేశారు. ఈ నెల 16 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుందని, రూరల్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కించబోతున్నామని, వచ్చే ఏడాది విడుదల చేస్తామని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి రౌడీ జనార్దన్‌ అనే పేరు ప్రచారంలో ఉంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఈ చిత్రానికి కెమెరా: ఆనంద్‌ సి చంద్రన్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: డినో శంకర్‌, రచన-దర్శకత్వం: రవికిరణ్‌ కోలా.

Social Share Spread Message

Latest News