
రోషన్ కనకాల కథానాయకుడిగా రూపొందుతున్న రొమాంటిక్ యాక్షన్ డ్రామా మోగ్లీ 2025. సందీప్‌రాజ్ దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణం తుదిదశకు చేరుకున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.డిసెంబర్ 12న ఈ సినిమాను విడుదల కానున్నది. ఇప్పటికే హీరో నాని వాయిస్ ఓవర్‌తో వచ్చిన ఫస్ట్ గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చిందని, తన ప్రేమను రక్షించుకోవడానికి ఎంతదూరమైన వెళ్లే యువకుడి గా రోషన్ కనకాల పాత్ర శక్తివంతగా సాగుతుందని మేకర్స్ చెబుతున్నారు. బండి సరోజ్‌కుమార్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో హర్ష చెముడు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: రామ మారుతి ఎం., సంగీతం: కాలభైరవ.
















