కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న సినిమా కె-ర్యాంప్. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్స్ పై రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జైన్స్ నాని దర్శకుడు. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకురానుంది. హైదరాబాద్‌లో ట్రైలర్‌ను విడుదల చేశారు. కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ఈ సినిమాలో నేను పోషించిన క్యారెక్టర్ నేటి యువత ఆలోచనలకు దగ్గరగా ఉంటుంది. ఇలాంటి ఈజ్‌తో కూడిన పాత్రలు చేయడం నాకు చాలా ఇష్టం. ఫ్యామిలీ అంతా కలిసి ఈ సినిమా చూడండి. రెండున్నర గంటల పాటు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు అన్నారు.

ట్రైలర్ మాదిరిగానే సినిమా ఆద్యంతం కామెడీతో సాగుతుందని, ఈ దీపావళికి పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైనర్‌గా అలరిస్తుందని చిత్ర దర్శకుడు జైన్స్ నాని తెలిపారు. ఈవెంట్‌కు వచ్చిన అభిమానుల్ని చూస్తుంటే ఇంకా పెద్ద వేదికపై ట్రైలర్ లాంచ్ చేస్తే బాగుండనే ఫీలింగ్ కలిగిందని, ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం ఫుల్ ఎనర్జీని చూస్తారని చిత్ర నిర్మాత రాజేష్ దండా పేర్కొన్నారు. ఈ సినిమాలో తాను పోషించిన పాత్ర చాలా స్పెషల్ అని సీనియర్ నటుడు వీకే నరేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
















