
ఆనంద్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం తక్షకుడు. వినోద్ అనంతోజు దర్శకత్వం వహిస్తున్నారు. నితాన్షీ గోయెల్ కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. వేటగాడి చరిత్రలో జింకపిల్లలే నేరస్థులు అనే ట్యాగ్‌లైన్‌తో పోస్టర్ ఆసక్తినిరేకెత్తిస్తున్నది. ఇందులో ఆనంద్ దేవరకొండ చేతిలో తుపాకి పట్టుకొని ఆగ్రహంగా కనిపిస్తున్నారు. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించామని, ఆనంద్ దేవరకొండ కెరీర్‌లో విభిన్న చిత్రమవుతుందని మేకర్స్ తెలిపారు.
















