Namaste NRI

ఒక్క చుక్క రక్తం చిందించకుండా ఎమోషనల్ వార్.. సిద్ధు జొన్నలగడ్డ

సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం తెలుసుకదా. శ్రీనిధి శెట్టి, రాశీఖన్నా కథానాయికలుగా నటించారు. నీరజ కోన దర్శకురాలు. టీజీ విశ్వప్రసాద్‌, కృతిప్రసాద్‌ నిర్మాతలు. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ ఈ సినిమాలో నేను పోషించిన వరుణ్‌ పాత్ర ఒక్క చుక్క రక్తం చిందించకుండా ఎమోషనల్‌ వార్‌, సైకలాజికల్‌ వయొలెన్స్‌ క్రియేట్‌ చేస్తుంది. బెర్ముడా ట్రయాంగిల్‌ తనపై నుంచి ఎలాంటి నౌక వెళ్లినా లాగేసుకుంటుంది. ఈ సినిమా కూడా అలాంటి ముక్కోణపు ప్రేమకథ. చూసిన వాళ్లందరినీ తనలోకి లాగేసుకుంటుంది అన్నారు.

నిర్మాతలు విశ్వప్రసాద్‌, కృతిప్రసాద్‌ సినిమాకు బ్యాక్‌బోన్‌లా నిలిచారని, వారి ప్రోత్సాహం వల్లే సినిమా అద్భుతంగా వచ్చిందని దర్శకురాలు నీరజ కోన తెలిపారు. ఇది తమ సంస్థలో చాలా స్పెషల్‌మూవీ అని, ప్రతి ఒక్కరికి కనెక్ట్‌ అవుతుందని నిర్మాత కృతిప్రసాద్‌ చెప్పారు. చిత్రం నెల ఈ 17న ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News