Namaste NRI

ఆ దేశానికి ఆర్థికంగా ఎంతో ప్రయోజనం: రష్యా

భారతదేశం  రష్యా  నుంచి చమురు దిగుమతి చేసుకోబోదని, ఈ విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  చేసిన వ్యాఖ్యలపై రష్యా స్పందించింది.  భారత ఆర్థిక వ్యవస్థకు రష్యా చమురు ఎంతో ముఖ్యమని రష్యా విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. రష్యా డిస్కౌంట్‌పై భారత్‌కు చమురు ఎగుమతి చేస్తున్నదని, దాంతో ఆ దేశానికి ఆర్థికంగా ఎంతో ప్రయోజనం చేకూరుతున్నదని అన్నారు. రష్యా చమురు దిగుమతి చేసుకుంటుందన్న కారణంగా ట్రంప్‌ భారత్‌పై భారీగా సుంకాలు విధించారు.

రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేయడంతో ఉక్రెయిన్‌తో యుద్ధానికి రష్యా సాయపడినట్లు అవుతుందని, కాబట్టి రష్యా చమురును కొనుగోలు చేయడం మానుకోవాలని అమెరికా హెచ్చరిస్తూ వచ్చింది. అయితే అమెరికా హెచ్చరికలను భారత్‌ పట్టించుకోకపోవడంతో అదనపు సుంకాలు వేసింది. తాజాగా రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపేస్తానని మోదీ హామీ ఇచ్చినట్లు ట్రంప్‌ చెప్పడం చర్చనీయాంశమైంది.

Social Share Spread Message

Latest News