
సాయిదుర్గతేజ్ శక్తిమంతమైన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సంబరాల ఏటిగట్టు. ఐశ్వర్యలక్ష్మీ కథానాయిక. ఈ సినిమాకు రోహిత్ కె.పి దర్శకత్వం. ప్రైమ్ షో ఎంటర్‌టైనమెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నేడు సాయి ధరమ్ పుట్టినరోజు. ఈ సందర్భం గా మూవీ నుంచి అతడికి బర్త్‌డే విషెస్ తెలుపుతూ ఫస్ట్ గ్లింప్స్‌ను వదిలారు. సాయి తేజ్ ఇందులో బాలీ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. 125కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
















