అనీష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం లవ్ ఓటీపీ. రాజీవ్ కనకాల, జాన్విక, నాట్య రంగ కీలక పాత్రధారులు. విజయ్ ఎం.రెడ్డి నిర్మాత. హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ కనకాల మాట్లాడుతూ లవ్ ఓటీపీ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో చిత్రీకరించాం. ఈ ప్రయాణంలో నన్ను అనీష్, అతని టీం మెంబర్స్ ఎంతో సపోర్ట్ చేశారు. ఇందులో నేను తండ్రి పాత్రను పోషించాను. కొడుకుని కూతురిలా చూసుకునే ఓ డిఫరెంట్ ఫాదర్ కారెక్టర్‌ను చేశాను. థియేటర్లో అందరూ ఎంజారు చేసేలా, పగలబడి నవ్వుకునేలా ఈ చిత్రం ఉంటుంది.అందరూ తప్పకుండా చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

హీరోగా చేయడం తన కల అనీ, ఈ సినిమా ద్వారా దర్శకునిగా, హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉందని, మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇదని హీరో, డైరెక్టర్ అనీష్ తెలిపారు. అందరూ మనసుపెట్టి పనిచేసిన సినిమా లవ్ ఓటీపీ అని నిర్మాత పేర్కొన్నారు. ఇంకా కథానాయిక జాన్విక, బాబా భాస్కర్, నాట్యరంగ, డీవోపీ హర్ష, సంగీత దర్శకుడు ఆనంద్ కూడా మాట్లాడారు. నవంబర్ 14న సినిమా విడుదల కానున్నది.
















