Namaste NRI

ట్రంప్‌ నోట మళ్లీ అదేమాట .. ఈ ఏడాది చివరినాటికి

రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేసే విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మళ్లీ అదేమాటే మాట్లాడుతున్నారు. ర‌ష్యా నుంచి భార‌త్ చ‌మురు కొనుగోలు చేయ‌దని తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి రష్యా నుంచి భారత్‌ చమురు దిగుమతులను భారీగా తగ్గిస్తుందని పునరుద్ఘాటించారు. ఈ మేరకు భారత్‌ నుంచి తనకు హామీ వచ్చినట్లు వెల్లడించారు. ఈ ఏడాది చివరి నాటికి రష్యా చమురు దిగుమతులను భారత్‌ గణనీయంగా తగ్గిస్తుంది. తగ్గింపు క్రమంగా ఉంటుంది. ఇది మంచి చర్య. ఈ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనాకు హామీ ఇచ్చారు అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

కాగా, ఈ విషయంపై ట్రంప్‌ గత కొన్ని రోజులుగా సొంత ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. ఈ అంశాన్ని ఆయ‌న గ‌తంలోనూ పేర్కొన్న విష‌యం తెలిసిందే. భార‌త్ ఇప్పటికే వెన‌క్కి తగ్గింద‌ని, ర‌ష్యా నుంచి ఆయిల్ కొన‌డాన్ని ఆపేసిందంటూ ప్రకటనలు చేస్తున్నారు. అయితే, ట్రంప్‌ ప్రకటనలను భారత్‌ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. అయినప్పటికీ ట్రంప్‌ మళ్లీ మళ్లీ ఇలాంటి ప్రకటనలే చేస్తుండటం గమనార్హం.

Social Share Spread Message

Latest News