Namaste NRI

మాస్ జాతర నుంచి అదిరిపోయే సాంగ్ రిలీజ్

రవితేజ హీరోగా నటించిన చిత్రం మాస్‌ జాతర. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మ్యూజికల్‌ ప్రమోషన్స్‌లో వేగం పెంచారు. ఇప్పటికే మూడు పాటల్ని విడుదల చేసిన చిత్రబృందం సూపర్‌డూపర్‌ అంటూ సాగే నాలుగో పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.

భీమ్స్‌ సిసిరోలియో స్వరరపరచిన ఈ పాటను సురేష్‌ గంగుల రచించారు. భీమ్స్‌తో కలిసి రోహిణి సోరట్‌ ఆలపించారు. మాస్‌ను మెప్పించేలా హుషారెత్తించే బీట్‌తో ఈ పాట సాగింది. నాయకానాయికలు రవితేజ, శ్రీలీల తమదైన డ్యాన్స్‌ మూమెంట్స్‌తో ఆకట్టుకున్నారు. వినోదప్రధానంగా సాగే మాస్‌ ఎంటర్‌టైనర్‌ ఇదని, రవితేజ పాత్ర నవ్యపంథాలో సాగుతుందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రం ఈనెల 31న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, మాటలు: నందు సవిరిగాన, నిర్మాణ సంస్థ: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌, దర్శకత్వం: భాను భోగవరపు.

Social Share Spread Message

Latest News