Namaste NRI

నాగ్‌ వందో చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు?

అగ్ర హీరో అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన 100వ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. తమిళ దర్శకుడు రా.కార్తీక్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఓ మినీ షెడ్యూల్‌ని కూడా పూర్తి చేశారని సమాచారం. ఈ సినిమాలో నాగ్‌కు జోడీగా ముగ్గురు కథానాయికలు నటిస్తారట. వారిలో ఒకరుగా టబు ఇప్పటికే ఫైనల్‌ అయ్యారు. తాజాగా మరో హీరోయిన్‌ పాత్రకు సుస్మితాభట్‌ను ఖరారు చేసినట్టు తెలిసింది. మూడో కథానాయికగా ఓ స్టార్‌ హీరోయిన్‌ని ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పవర్‌ప్యాక్డ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతున్నదని, మునుపెన్నడూ చూడని కొత్త నాగార్జునను ఇందులో చూస్తారని చిత్రబృందం చెబుతున్నది. నాగచైతన్య, అఖిల్‌ కూడా ఇందులో ఓ కీలక పాత్రలు పోషించనున్న విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై రూపొందుతున్న ఈ పాన్‌ ఇండియా సినిమా వచ్చే ఏడాది చివర్లో విడుదల కానున్నది.

Social Share Spread Message

Latest News