Namaste NRI

రమణీ కల్యాణం టైటిల్ పోస్టర్ లాంచ్

దీప్శిక, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం రమణి కల్యాణం. విజయ్‌ ఆదిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దర్శకుడు రామ్‌జగదీష్‌ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ అందించారు. శుక్రవారం టైటిల్‌ని రివీల్‌ చేశారు. జీవితంలోని అనేక సవాళ్ల మధ్య.. ప్రేమ, విలువలు, కుటుంబ అనుబంధాలతో హృదయాలను స్పృశించే చిత్రమిదని, ఓ అందమైన ప్రేమప్రయాణంలా ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు. ఈ ప్రేమకథలో చక్కటి భావోద్వేగాలతో పాటు వినోదం కూడా సమపాళ్లలో ఉం టుందని, ఈ రోజే చిత్రాన్ని ప్రా రంభించామని చిత్రబృందం పేర్కొది. శ్రీనివాస్‌ రెడ్డి, శ్యామల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అరవింద్‌ తిరుకోవెల, సంగీతం: సూరజ్‌, రచన-దర్శకత్వం: విజయ్‌ ఆదిరెడ్డి.

Social Share Spread Message

Latest News