Namaste NRI

జీ-20 సదస్సును బహిష్కరిస్తున్నాం: ట్రంప్ సంచలన ప్రకటన

దక్షిణాఫ్రికాలో జరుగనున్న జీ20 శిఖరాగ్ర సమావేశానికి అమెరికా అధికారులెవరూ హాజరుకాబోరని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. శ్వేత జాతి రైతులతో క్రూరంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన జీ20 శిఖరాగ్ర సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల చివర్లో జరిగే జీ20 శిఖరాగ్ర సమావేశానికి తాను హాజరు కాబోనని ట్రంప్ గతంలోనూ ప్రకటించారు. నవంబర్ 22-23 తేదీల్లో జరిగే ప్రపంచంలోని ప్రముఖ, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల దేశాధినేతల వార్షిక శిఖరాగ్ర సమావేశానికి తాను హాజరు కాబోనని ట్రంప్ గతంలో తెలిపారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన స్థానంలో హాజరవుతారని భావించారు. వాన్స్ ఈ శిఖరాగ్ర సమావేశానికి వెళ్లరని ట్రంప్‌ పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News