Namaste NRI

ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో కి విశేష ప్రేక్షకాదరణ

తిరువీర్‌ కథానాయకుడిగా నటించిన తాజా బ్లాక్‌బస్టర్‌ ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో. టీనా శ్రావ్య కథానాయిక. రాహుల్‌ శ్రీనివాస్‌ దర్శకుడు. సందీప్‌ అగరం, అష్మిత రెడ్డి నిర్మాతలు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ ఫన్‌ షోలో హీరో తిరువీర్‌ మాట్లాడారు. ఎక్కడా ఒక్క నెగెటివ్‌ కామెంట్‌ లేకుండా, కేవలం మౌత్‌ టాక్‌తో బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌ని అందుకున్నది మా ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో. థియేటర్లలో క్రౌడ్‌ కూడా పెరుగుతోంది. ఈ చిన్న సినిమాను ఎంకరైజ్‌ చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం అని అన్నారు.

అతిథిగా విచ్చేసిన రచయిత, దర్శకుడు బి.వి.ఎస్‌.రవి ఈ సినిమా విజయం పట్ల హర్షం వెలిబుచ్చారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ థియేటర్లలో ఈ సినిమా ఆడుతుందో లేదో అనే డౌట్‌ ఉండేది. కలెక్షన్లు చూశాక నా అనుమానం పటాపంచలైపోయింది. థియేట్రికల్‌గా కూడా ఆడియన్స్‌ ఈ సినిమాను పెద్ద హిట్‌ చేశారు. సహజత్వంతో కూడిన కథల్ని చూసేందుకు ఆడియన్స్‌ ఇష్టపడతారని ఈ సినిమా నిరూపించింది అని చెప్పారు. ఇంకా నిర్మాత సందీప్‌ ఆగరం, హీరోయిన్‌ టీనా శ్రావ్య, చిత్రబృందం మాట్లాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events