
రోజా భారతి, దినేష్, సుమంత్, అనుపమ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సీత ప్రయాణం కృష్ణతో . దేవేందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి డా॥రాజీవ్, డా॥ రోజా భారతి నిర్మాతలు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇదని, ఓ జంట ప్రేమప్రయాణంలోని అనుభూతులకు అద్దంపడుతుందని దర్శకుడు తెలిపారు. నేటి యువతను ఆకట్టుకునే లవ్‌స్టోరీ ఇదని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: రవీంద్ర, సంగీతం: శరవణ వాసుదేవన్, దర్శకత్వం: దేవేందర్.
















