Namaste NRI

ఘంటసాల ది గ్రేట్‌ టీజర్‌ లాంచ్‌

గాన గంధర్వుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ఘంటసాల ది గ్రేట్‌. సి.హెచ్‌.రామారావు దర్శకుడు. సి.హెచ్‌.మణి నిర్మాత. గాయకుడు కృష్ణచైతన్య ఇందులో ఘంటసాలగా నటించగా, ఘంటసాల సతీమణి సావిత్రమ్మగా మృదుల, బాల ఘంటసాలగా అతులిత కనిపించనున్నారు. సుమన్‌ కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆదిత్య హాసన్‌ టీజర్‌ని లాంచ్‌ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు.

ఘంటసాల పాటలు వింటూ పెరిగిన తాను ఈ రోజు ఆయన కథతో తీసిన సినిమాలో భాగమవ్వడం అదృష్టంగా భావిస్తున్నానని, సినిమా చూసినవారంతా భావోద్వేగానికి లోనవుతారని హీరో కృష్ణ చైతన్య చెప్పారు. గాయకుడిగా కంటే వ్యక్తిగా ఘంటసాల ఏంటో సమాజానికి తెలియజేయాలనే ఈ సినిమా తీశామని, ఎన్ని శక్తులు అడ్డుకున్నా ఈ సినిమాను డిసెంబర్‌ 12న విడుదల చేసి తీరుతామని దర్శకుడు రామారావు చెప్పారు. ఇంకా రామ సత్యనారాయణరాజు, శోభారాణి, కర్రి బాలాజీ కూడా మాట్లాడారు. డిసెంబర్‌ 12న చిత్రం విడుదల కానున్నది.

Social Share Spread Message

Latest News