Namaste NRI

బాలకృష్ణకు మరో విశిష్ట గౌరవం

టాలీవుడ్ సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణకు మరో విశిష్ట గౌరవం లభించింది. గోవాలో (నవంబర్ 20) గ్రాండ్‌గా ప్రారంభమైన 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) వేడుకల్లో బాలయ్యను ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా అభినందనలు తెలియజేశారు. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, కేంద్ర సమాచార ప్రసారశాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ సమక్షంలో ఈ సన్మానం జరగడం విశేషం. సినీ పరిశ్రమలో నటుడిగా బాలకృష్ణ 50 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ గౌరవం అందించారు.

Social Share Spread Message

Latest News