Skip to main content

Namaste NRI

ఇది మాగా సభ్యులు అర్థం చేసుకోవాలి :డొనాల్డ్‌ ట్రంప్‌

నిన్న మొన్నటి వరకు హెచ్‌-1బీ వీసా ఉద్యోగులంటేనే ఒంటికాలిపై లేచి వారిపై కఠిన ఆంక్షలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మెల్లిమెల్లిగా తత్తం బోధపడుతున్నట్టుంది. విదేశీ ఉద్యోగుల అవసరం అమెరికాకు చాలా ఉందని ఆయన తాజాగా అంగీకరించారు. ఈ విషయాన్ని మాగా మద్దతుదారులు అర్థం చేసుకోకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. అమెరికా-సౌదీ పెట్టుబడుల ఫోరంలో ట్రంప్‌ మాట్లాడుతూ అమెరికాలో చాలా పెద్ద సంఖ్యలో ప్లాంట్లను నిర్మిస్తామని, వాటిలో పనిచేసేందుకు నైపుణ్యం కలిగిన విదేశీయులను తీసుకురావాల్సి ఉంటుందన్నారు. వారు అమెరికన్లకు కూడా ఆ నైపుణ్యాలను నేర్పించాలని ఆయన పేర్కొన్నారు. యూఎస్‌లోని కంపెనీల్లో ట్రిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టి వారిని అనుమతించక పోతే తాము విజయం సాధించలేమని ఆయన అంగీకరించారు. విదేశీ వృత్తి నిపుణులు వేలాది మందిని తమతో తీసుకురావాలని, తాము వారిని స్వాగతిస్తామని చెప్పారు.

Social Share Spread Message

Latest News