
తాము అనుకున్న లక్ష్యాలను సాధించిన అనంతరం అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునే 2026 జులై 4వ తేదీలోపు ఈ ఫెడరల్ బ్యూరోక్రసీని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని అప్పట్లోనే ట్రంప్ ప్రకటించారు. అయితే దాని గడువు కంటే ఎనిమిది నెలల ముందే డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్)ను మూసివేస్తున్నట్టు అమెరికా ప్రభు త్వం వెల్లడించింది. రెండోసారి అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇందులోభాగంగా ఏర్పాటుచేసిన డోజ్ విభాగానికి ఎలాన్ మస్క్ ను, భారత సంతతికి చెందిన పారిశ్రా మికవేత్త వివేక్ రామస్వామిలను సంయుక్త సారథులుగా నియమించారు. ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు, శాఖల్లో వథా ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా ఇది పని చేస్తుందని చెప్పిన ట్రంప్, ఆవిధంగానే వివిధ శాఖల్లో వేలాది మంది ఉద్యోగులను తొలగించారు. అనంతరం రామస్వామి డోజ్ నుంచి వైదొలిగారు. ఈ క్రమంలో మస్క్ తీరుపై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ట్రంప్ యంత్రాంగాన్ని ఎలాన్ మస్క్ వెనకుండి నడిపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో డోజ్‌లో మస్క్ ఉద్యోగి కాదని, ట్రంప్ సలహాదారుడిగా మాత్రమే మస్క్ ఆ బాధ్య తలు చూస్తున్నారని వైట్‌హౌస్ వెల్లడిం చింది.
















