Skip to main content

Namaste NRI

ఆర్ఆర్ఆర్ నుంచి సర్ ప్రైజ్

దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఫిక్షనల్‌ పీరియాడిక్‌ డ్రామా ఆర్‌ఆర్‌ఆర్‌ (రౌద్రం రణం రుధిరం) కోసం సినీ అభిమానులు ఎంతలా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకులముందుకు రానుంది. దీపావళి కానుకగా పోరాట సన్నివేశాలతో కూడిన వీడియోను విడుదల చేశారు. ఈ సినిమాలో తొలితరం స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. తాజా వీడియోలో వీరిద్దరి మధ్య చోటుచేసుకునే పోరాట ఘట్టాలతో పాటు సినిమాలో ఇతర ప్రధాన పాత్రల్ని చూపించారు. కీరవాణి నేపథ్య సంగీతం ఈ వీడియోకు ప్రధానాకర్షణగా నిలిచింది. ఈ చిత్రంలో అలియాభట్‌, ఒలీలియా మోరీస్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. అజయ్‌దేవ్‌గణ్‌, సముద్రఖని, శ్రియ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దాదాపు 450 కోట్ల భారీ వ్యయంతో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌  పతాకంపై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాహుబలి తర్వాత రాజమౌళి నుంచి వస్తోన్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్‌  సినిమా ప్రపంచవ్యాప్తంగా పది భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Social Share Spread Message

Latest News