Namaste NRI

భారత్‌ పర్యటనకు పుతిన్‌

 రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఈ ఏడాది డిసెంబర్‌ 4-5 తేదీల్లో భారత్‌ను సందర్శించనున్నారు. భారత్‌-రష్యా 23వ వార్షిక సదస్సుకు పుతిన్‌ హాజరవుతారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. పుతిన్‌ పర్యటన రెండు దేశాల మధ్య దీర్ఘ కాలిక ప్రత్యేక,వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. రక్షణ రంగంలో సహకారం, వ్యాపార, ఆర్థిక సంబంధాలు, పౌర అణు సహకారం, అంతర్జాతీయ పరిస్థితులు, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంపై భారత ప్రధానితో పుతిన్‌ చర్చించే అవకాశం ఉన్నది.

Social Share Spread Message

Latest News