Namaste NRI

బ్రిటన్ వెళ్లాలనుకునే వారికి షాక్

పాకిస్థానీ మూలాలుగల బ్రిటిష్‌ హోం సెక్రటరీ షబానా మహమూద్‌ వలసదారుల కోసం చేసిన ప్రతిపాదనలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ ప్రతిపాదనలకు పార్లమెంటు ఆమోదం కచ్చితంగా లభించవచ్చు. అవి చట్టంగా అమలైతే, ఏటా వేలాది భారతీయ వలసదారులపై ప్రభావం పడుతుంది. ఆమె చేసిన ప్రతిపాదనల ప్రకారం, శరణార్థులకు తాత్కాలిక హోదాను కేవలం రెండున్నరేళ్లు మాత్రమే ఇవ్వాలి. ఆ తర్వాత వారి స్వదేశాల్లో పరిస్థితులు మెరుగుపడితే, వారిని తిరిగి ఆయా దేశాలకు పంపించేయాలి. శాశ్వతంగా బ్రిటన్‌లో స్థిరపడాలంటే 20 ఏళ్ల తర్వాతే వారి దరఖాస్తులను పరిశీలించాలి. బ్రిటన్‌లో ఆశ్రయం కోరుతున్నవారిలో భారతీయులు ఆరో స్థానంలో ఉన్నారు.

2024 జూలై నుంచి 2025 జూన్‌ వరకు 5,475 మంది ఆశ్రయం క్లెయిమ్‌ చేశారు. వీరిలో కేవలం 20 మందికి మాత్రమే ఆశ్రయం లభించింది, 2,691 మందికి ఆశ్రయాన్ని తిరస్కరించారు. మిగిలినవారంతా ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. 5,475 మంది భారతీయుల్లో 346 మంది చట్టవిరుద్ధంగా చిన్న పడవల్లో బ్రిటన్‌కు వెళ్లారు. మిగిలిన వారిలో చాలా మంది స్టూడెంట్‌ వీసాల వంటి చట్టబద్ధ మార్గాల్లో వెళ్లారు. ఆ తర్వాత తమ వీసా గడువు ముగిసిన తర్వాత ఆశ్రయం కోరారు. ఇటువంటి వారిని బ్రిటన్‌ నుంచి పంపించడం ప్రారంభిస్తామని మహమూద్‌ చెప్పారు.

Social Share Spread Message

Latest News