
చిరంజీవి నటిస్తున్న నూతన చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో చిరుతో వెంకటేష్ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇరువురి ఫ్యాన్స్కి బిగ్గెస్ట్ ట్రీట్ కానుంది. తాజాగా వెంకటేష్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. మన శంకర వర ప్రసాద్ గారు సినిమా కోసం నా భాగం ఈరోజుతో పూర్తయ్యింది. ఇది ఎంతో అద్భుతమైన అనుభవం నాకు ఎంతో ఇష్టమైన మెగాస్టార్ చిరంజీవితో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా అనిపించింది. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎంతోకాలంగా ఎదురుచూశాను. ఆ అవకాశాన్ని ఈ ప్రత్యేకమైన సినిమాతో ఇచ్చినందుకు డైరెక్టర్ అనిల్ రావిపూడికి హదయపూర్వక ధన్యవాదాలు. మనం అందరం కలిసి 2026 సంక్రాంతిని థియేటర్స్లో ఘనంగా సెలబ్రేట్ చేద్దాం అని పేర్కొన్నారు.





























