Skip to main content

Namaste NRI

ఘంటసాల ది గ్రేట్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌

గానగంధర్వుడు ఘంటసాల వేంకటేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్‌ ఘంటసాల ది గ్రేట్‌. గాయకుడు కృష్ణచైతన్య ఘంటసాల పాత్ర పోషించగా, ఘంటసాల సతీమణి సావిత్రమ్మగా మృదుల కనిపించనుంది. చిన్ననాటి ఘంటసాలగా అతులిత నటించారు. సి.హెచ్‌.రామారావు దర్శకత్వంలో సి.హెచ్‌.ఫణి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. రేలంగి నరసింహారావు, తమ్మారెడ్డి భరద్వాజ్‌. జె.కె.భారవి, చదలవాడ శ్రీనివాస్‌, తుమ్మలపల్లి రామసత్యనారాయణ అతిథులుగా విచ్చేసి టీమ్‌కి శుభాకాంక్షలు అందించారు.

ఘంటసాల జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమాలో ఘంటసాలగా నటించా. ఇది నాకు దేవుడిచ్చిన వరం అని కృష్ణచైతన్య అన్నారు. కోట్లాదిమందికి ఆరాధ్యుడైన ఘంటసాల జీవితంలోని ఎత్తుపల్లాలు అందరికీ తెలియాలనే ఈ సినిమా చేశాను. దేశచరిత్రలో ఓ సింగర్‌ బయోపిక్‌ తెరకెక్కడం ఇదే ప్రథమం అని దర్శకుడు సి.హెచ్‌.రామారావు తెలిపారు. ఈ సినిమా మరో శంకరాభరణం కావాలని డిస్ట్రిబ్యూటర్‌ శోభారాణి ఆశాభావం వెలిబుచ్చారు.

Social Share Spread Message

Latest News