Namaste NRI

బుచ్చిబాబు సానా చేతుల మీదుగా పురుష టీజర్ విడుదల

వివాహానంతరం పురుషులు పడే అవస్థలు, వారి జీవితంలో చోటుచేసుకునే మార్పులను వినోదాత్మకంగా చూపిస్తూ తెరకెక్కిస్తున్న సినిమా పురుషః. పవన్‌కల్యాణ్‌ బత్తుల హీరోగా పరిచయమవుతున్నాడు. వీరు వులవల దర్శకుడు. బత్తుల కోటేశ్వరరావు నిర్మాత. ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు బుచ్చిబాబు సానా విడుదల చేశారు. ప్రతీ సీన్‌లో చక్కటి కామెడీ పండిస్తూ టీజర్‌ సాగింది. మగజాతి ఆణిముత్యాలండీ మీరు అనే డైలాగ్‌తో టీజర్‌ను ముగించారు. భార్యభర్తల అనుబంధంతో పాటు వారి మధ్య గిల్లికజ్జాలను హాస్యప్రధానంగా ఈ సినిమాలో ఆవిష్కరిస్తున్నామని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్‌ భరద్వాజ్‌.

Social Share Spread Message

Latest News