Skip to main content

Namaste NRI

తెలుగువారి గుండెల్లో నిలిచిపోయే గొల్ల రామవ్వ

భారత మాజీప్రధాని, స్వర్గీయ పీవీ నరసింహారావు రచించిన ప్రఖ్యాత కథ గొల్ల రామవ్వ అదే పేరుతో ఓటీటీలో సినిమాగా రాబోతున్నది. తాళ్లూరి రామేశ్వరి టైటిల్‌ రోల్‌ని పోషించారు. తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో సాగే ఈ కథకు ముళ్లపూడి వరా దర్శకత్వం వహించారు. సుచేత డ్రీమ్‌ వర్క్‌ ప్రొడక్షన్‌, వర్మ డ్రీమ్‌ క్రియేషన్స్‌ పతాకాలపై రామ్‌ విశ్వాస్‌ హనూర్కర్‌, రాఘవేంద్రవర్మ (బుజ్జి) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 25 నుంచి ఈటీవీ విన్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. హైదరాబాద్‌లో ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీవీ నరసింహా రావు కుమార్తె, ఎమ్మెల్సీ  సురభి వాణీదేవి మాట్లాడుతూ ట్రైలర్‌ చూస్తుంటే చిన్నతనంలో మన అమ్మమ్మలు, నానమ్మలు చెప్పిన రజాకార్ల కథలు గుర్తొచ్చాయని, నాటి అకృత్యాలను కళ్లకు కట్టినట్లుగా చూపించారని అన్నారు. ఈ సినిమా తెలంగాణ సాయుధ పోరాటంలోని త్యాగాలను నేటి తరానికి పరిచయం చేస్తూ, చరిత్ర పుటల్లోకి తీసుకెళ్తుందని, గొల్ల రామవ్వ వీరత్వాన్ని ఈ సినిమాలో అద్భుతంగా చూపించారని ఆమె కొనియాడారు.

అప్పట్లో ప్రతీ పల్లెలో, ఇంటిలో ఓ గొల్లరామవ్వ ఉండేదని గీత రచయిత కాసర్ల శ్యామ్‌ చెప్పారు. 30 నిమిషాల నిడివితో సాగే ఈ మినీ మూవీలో కథలోని సమస్త భావోద్వేగాలను ఆవిష్కరించామని దర్శకుడు ముళ్లపూడి వరా పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: గంగమోని శేఖర్‌, సంగీతం: సాయి మధుకర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: అజహర్‌షేక్‌, రచన: బయ్యవరపు రవి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ముళ్లపూడి వరా.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events