Skip to main content

Namaste NRI

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి డిసెంబర్ 10న పోలింగ్ జరగనుంది. తెలంగాణలో 12 స్థానాలకు, ఆంధ్రప్రదేశ్లో 11 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 16న నోటిపికేషన్ జారీ చేస్తారు. 23వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 24న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 26వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. డిసెంబరు 10వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ నిర్వహిస్తారు. 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.

Social Share Spread Message

Latest News