మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మోహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ పేరుతో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. రామబ్రహ్మం సుంకర నిర్మాత. ఈ నెల 11న లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారు. ఈ సినిమాలో కథానాయికగా తమన్నాను ఎంపిక చేసినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. సైరా తర్వాత ఈ అమ్మడు చిరంజీవితో నటించబోతున్న రెండో చిత్రమిది కావడం విశేషం. అన్నాచెళ్లళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కించనున్న ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తున్నది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందనున్న ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతాన్నందించనున్నారు. 2022లో ప్రేక్షకుల ముందుకు రానుంది.














