Skip to main content

Namaste NRI

అగ్రరాజ్యంలో మళ్లీ కరోనా ఉధృతి

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి మళ్లీ  కోరలు చాస్తున్నది. పలు  ప్రాంతాల్లోని దవాఖానల ఐసీయూలు కరోనా రోగులతో నిండిపోతున్నాయి. రెండు వారాల కిందటితో పోలిస్తే 12 రాష్ట్రాల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల సంఖ్య పెరిగింది. వ్యాక్సినేషన్‌ రేటు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా దవాఖానలపై ఒత్తిడి తీవ్రంగా ఉండటం కరోనా తాజా వేవ్‌ను సూచిస్తున్నదని చెబుతున్నారు. పలు పశ్చిమ రాష్ట్రాల్లో చికిత్స అందించేందుకు  వైద్యులు, నర్సులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒకవైపు దేశంలో డెల్టా వేరియంట్‌ వ్యాప్తి ఇప్పిటికే కొనసాగుతున్నది. మరోవైపు శీతాకాలంలో వైరల్‌ వ్యాధుల బెడద ఉంటుంది. ఈ నేపథ్యంలో రాబోయే కొన్ని నెలలు కష్టకాలమేనన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.

Social Share Spread Message

Latest News